Saturday, November 21, 2009

గర్భిణీ స్త్రీలు, పళ్ళ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

గర్భంతో ఉన్నప్పుడు Dentist దగ్గరకు వెళ్లాలా సాధారణంగా ఆరు నెలలకో సారి వెళ్లినట్లు పళ్లు చూయించుకోవటానికి, వెళ్లితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ గర్భంతో ఉన్నప్పుడు పళ్ల నెప్పులు వస్తే ఏమి చేయాలి అని పిల్లలకోసం plan చేసే వారు, గర్భంతో ఉన్న వారు అడుగుతూ ఉంటారు. వాటి గురించి ఈ టపా.

1. గర్భం తో ఉన్నప్పుడు డెంటిస్ట్ దగ్గరకు వెళ్లాలా?

గర్భంతో ఉన్నప్పుడు చిగుళ్లు సాధారణం గా ఎక్కువగా రక్తం కారుతూ ఉంటాయి హార్మోన్ల వలన. అందుకని ప్రతి ఆరునెలల క్లీనింగ్ కు వెళ్లె visits చాలా ముఖ్యం గర్భిణితో ఉన్నప్పుడు. అంతేకాక రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవటం, floss చేసుకోవటం మాములు అప్పుడు కంటే ఎక్కువ ముఖ్యం. మీ చిగుళ్ళు, మీ దంతాల పరిస్థితి ని బట్టి, మీ డెంటిస్ట్ మామూలు కంటే ఎక్కువసార్లు క్లీనింగ్స్ కూడా సూచించవచ్చు.
గర్భంతో ఉన్నప్పుడు ఏమయినా పళ్ళ నెప్పులు infections లాంటివి వస్తే వాటిని సరిగా ట్రీట్ చేయించుకోకపోతే మీతో పాటు మీ గర్భం లో ఉన్న శిశువు కు కూడా రిస్క్ కావచ్చు, కాబట్టి "అవసరమయిన" ట్రీట్మెంట్స్ చేయించుకోవటం తప్పనిసరి.

2. డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ముందుగా మీరు గర్భం తో ఉన్నట్లు డెంటిస్ట్ కు కాని, వాళ్ల స్టాఫ్ కు కాని చెప్పటం మర్చిపోకండి. దానిని బట్టి వాళ్లు ఎక్సరేలు తీసేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తారు (ఉదా : వీలయినన్ని ఎక్సరే లు గర్భం తర్వాత తీయటం, తక్కువుగా ఎక్సరేలు తీయటం, తీసేటప్పుడు రెండు ఎక్సరే బేరియర్స్ వాడటం లాంటివి). అంతే కాకుండా ఎనస్థీషియా ఇవ్వాల్సి వచ్చినా, ఎమయినా మందులు ఇచ్చినా జాగ్రత్తలు పాటిస్తారు. ఒక్కోసారి మీ గైనకాలజిస్ట్ ను కూడా సంప్రదిస్తారు ఎమయినా ట్రీట్మెంట్ ఇవ్వాల్సివస్తే.

. పిల్లలకు పాలు ఇస్తున్నవారు డెంటిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ కు వెళ్ళవచ్చా?

సుబ్బరం గా వెళ్ళవచ్చు. డెంటిస్ట్ ల వాడే ఎక్సరే లు కాని, పళ్లకు (అవసరం అయితే) ఇచ్చే ఏనాస్తీసియా మందులు novacaine/lidocaine కాని breast ఫీడింగ్ కు ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఇవ్వవు. ఏమయినా అనుమానం ఉంటె మీ గైనకాలజిస్ట్ ను కనుక్కోండి కాని, అమ్ముమ్మ చెప్పింది అనో, మా పక్కింటి ఆంటీ చెప్పింది అనో మాత్రం, డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళటం మానకండి.

గమనిక: ఇక్కడ వ్ర్రాసినది, కేవలం సూచనలు గానే తీసుకోండి, ఇది సలహా గా కాని, మీ డెంటల్/మెడికల్ డాక్టర్ లు మిమ్ములను చూసి ఇచ్చే ట్రీట్మెంట్లకు ప్రత్యామ్నాయం గా కాని తీసుకోకండి. మీకు దంత సమస్యలు ఉంటే మీ డెంటిస్ట్ / మెడికల్ డాక్టర్ ను సంప్రదించండి. (మా మీద సూలు గట్రాలు పడకుండా జాగ్రత్తపడే ముక్కలు అన్నమాట పైనవి :) )