Saturday, September 19, 2009

పిల్లల పళ్ల గురుంచి సాధారణం గా తల్లితండ్రులు అడిగే ప్రశ్నలు & నా సలహాలు.

నేను జనరల్ డెంటిస్ట్ ని అయినప్పటికి, చిన్న పిల్లలను కూడా ట్రీట్ చేస్తూ ఉంటాను, సాధారణంగా చిన్న పిల్లలు ఉన్న తల్లితండ్రులు నన్ను అడిగే ప్రశ్నలు వాటికి నా సలహాలు మన తెలుగు వాళ్ల కోసం.

1. ఏ వయసులో పిల్లలను డెంటిస్ట్ దగ్గరకు తీసుకుకొని వెళ్లటం మొదలు పెట్టాలి?
మొదటి పుట్టినరోజు వచ్చేటప్పటికి, అప్పటికి పళ్లు రావటం మొదలుపెడతాయి కాబట్టి. పిల్లలలో బాటిల్ త్రాగుతూ (జ్యూస్ కాని, పాలు కాని) నిద్ర పుచ్చటం, బ్రష్ సరిగా చేయకపోవటం, ముఖ్యం గా, చాక్లేట్ లు లాంటి వి తిన్న తరువాత, చాలా చిన్నపిల్లలలో కూడా (18 నెలలనుండి, 3 సంవత్సరాల పిల్లలలో కూడా) దంతక్షయం చూస్తూ ఉంటాము అందుకని.

2. పిల్లల దంత ఆరొగ్యానికి మీరిచ్చే సలహాలు
ముందు బాటిల్స్ అందులొ ముఖ్యంగా జ్యూస్  ఇచ్చి నిద్రపుచ్చే అలవాటు ఉన్నట్లయితే మానివేయండి. బాటిల్స్ 12 నెలల వయసు నుండి 18 నెలల వయసులో మానివెయటం మంచిది.
రోజుకు రెండు సార్లు పెద్ద వాళ్ల కు వలనే, పిల్లలకు కూడా పిల్లల బ్రష్ తో బ్రష్ చేయండి. ఆ వయసులో పేస్ట్ బయటకు ఊయలేరు కాబట్టి, చాలా తక్కువ పేస్ట్ వేసి బ్రష్ చేయటం మంచిది.


గమనిక: ఇక్కడ వ్ర్రాసినది, కేవలం సలహా కోసం మాత్రమే, ఇది మీ డెంటల్/మెడికల్ డాక్టర్ లు మిమ్ములను చూసి ఇచ్చే ట్రీట్మెంట్లకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు. మీకు దంత సమస్యలు ఉంటే మీ డెంటిస్ట్ / మెడికల్ డాక్టర్ ను సంప్రదించండి. (మా మీద సూలు గట్రాలు పడకుండా జాగ్రత్తపడే ముక్కలు అన్నమాట పైనవి :) )