Saturday, September 19, 2009

పిల్లల పళ్ల గురుంచి సాధారణం గా తల్లితండ్రులు అడిగే ప్రశ్నలు & నా సలహాలు.

నేను జనరల్ డెంటిస్ట్ ని అయినప్పటికి, చిన్న పిల్లలను కూడా ట్రీట్ చేస్తూ ఉంటాను, సాధారణంగా చిన్న పిల్లలు ఉన్న తల్లితండ్రులు నన్ను అడిగే ప్రశ్నలు వాటికి నా సలహాలు మన తెలుగు వాళ్ల కోసం.

1. ఏ వయసులో పిల్లలను డెంటిస్ట్ దగ్గరకు తీసుకుకొని వెళ్లటం మొదలు పెట్టాలి?
మొదటి పుట్టినరోజు వచ్చేటప్పటికి, అప్పటికి పళ్లు రావటం మొదలుపెడతాయి కాబట్టి. పిల్లలలో బాటిల్ త్రాగుతూ (జ్యూస్ కాని, పాలు కాని) నిద్ర పుచ్చటం, బ్రష్ సరిగా చేయకపోవటం, ముఖ్యం గా, చాక్లేట్ లు లాంటి వి తిన్న తరువాత, చాలా చిన్నపిల్లలలో కూడా (18 నెలలనుండి, 3 సంవత్సరాల పిల్లలలో కూడా) దంతక్షయం చూస్తూ ఉంటాము అందుకని.

2. పిల్లల దంత ఆరొగ్యానికి మీరిచ్చే సలహాలు
ముందు బాటిల్స్ అందులొ ముఖ్యంగా జ్యూస్  ఇచ్చి నిద్రపుచ్చే అలవాటు ఉన్నట్లయితే మానివేయండి. బాటిల్స్ 12 నెలల వయసు నుండి 18 నెలల వయసులో మానివెయటం మంచిది.
రోజుకు రెండు సార్లు పెద్ద వాళ్ల కు వలనే, పిల్లలకు కూడా పిల్లల బ్రష్ తో బ్రష్ చేయండి. ఆ వయసులో పేస్ట్ బయటకు ఊయలేరు కాబట్టి, చాలా తక్కువ పేస్ట్ వేసి బ్రష్ చేయటం మంచిది.


గమనిక: ఇక్కడ వ్ర్రాసినది, కేవలం సలహా కోసం మాత్రమే, ఇది మీ డెంటల్/మెడికల్ డాక్టర్ లు మిమ్ములను చూసి ఇచ్చే ట్రీట్మెంట్లకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు. మీకు దంత సమస్యలు ఉంటే మీ డెంటిస్ట్ / మెడికల్ డాక్టర్ ను సంప్రదించండి. (మా మీద సూలు గట్రాలు పడకుండా జాగ్రత్తపడే ముక్కలు అన్నమాట పైనవి :) )

8 comments:

  1. చాలా మంచి ప్రయత్నం. అభినందనలు.

    ReplyDelete
  2. డాక్టర్ బిందు గారు, మీ బ్లాగు చాలా బాగుంది. చిన్న ప్రశ్న. మాకు ఇద్దరు పిల్లలు (రెండేళ్ళ పైన ఒకడు, నాలుగు నెలల్లో ఒకడు :) ). పెద్ద వానికి బ్రష్ చేసినప్పుడు నాలిక ని శుభ్రం చెయ్యడానికి మీరు ఇచ్చే సలహా ఏమిటి? మేము ప్రస్తుతం పళ్ళు తోమే బ్రుష్ తో నే నాలిక కూడా శుభ్రం చేస్తున్నాము.. ఇది కాకుండా వేరే మార్గం ఏమైనా ఉందా? తెలియజెయ్యగలరు (మీ ఫీజు ధన్యవాదాల రూపం లో ఇచ్చుకుంటాము :) ).

    ReplyDelete
  3. రామ గారు,
    లేటు గా మీ ప్రశ్న చూసాను, చిన్న పిల్లలలో నాలుక శుబ్రపరచటానికి బ్రష్ సరిపోతుంది, ఈ మద్య పిల్లల బ్రష్ వెనుక ప్రక్క tongue cleaners వస్తున్నాయి (ఉదా: crest కంపెనీవి ) వాటిని అయినా వాడవచ్చు.
    చిన్న వయసులో మాత్రం బ్యాటరీ తో నడిచేవి వాడకండి.

    మీరు ఈ బ్లాగ్ చూస్తూ, ప్రశ్నలు అడగటమే నాకు మీరిచ్చే ఫీజు, ఇక ధన్యవాదాలు అక్కర్లేదు :)

    ReplyDelete
  4. ఐతే మరొక ప్రశ్న..
    పిల్లలలో దంతాలు ఎంత వయసు లో ఎక్స్పెక్ట్ చెయ్యవచ్చు? మా పెద్ద వాడి వయసు రెండున్నర ఏళ్ళు. వానికి లోపలి దంతాలు ఇంకా రాలేదు. పై భాగం లో ఒకటి మాత్రం వచ్చింది. దంత వైద్యులకి చూపించి సలహా తీసుకోవలసిన సమయమా లేక ఇంకొంచెం ఆగవచ్చా తెలియజేయగలరు.
    ఈ ప్రశ్న పై మీరు వెచ్చించబోయే సమయానికి ధన్యవాదములు.

    ReplyDelete
  5. నాకు అర్ధం అయినంతవరకు, పైన arch లో ఒక్కపన్నే వచ్చింది, క్రింద(lower arch) లో ఒక్కటీ రాలేదు అని, రెండు సంవత్సరాలుకు ఒక్క పన్నే రావటం అనేది చాలా అరుదు. ఒకసారి Dentist కు తప్పకుండా చూపించండి. x-rays(panoramic) తీస్తే క్రిందన పళ్లు ఉన్నదీ లేనిదీ, ఉండి ఉంటే ఎంతవరకూ వస్తున్నదీ తెలుస్తుంది. కుదిరితే పిల్లల దంతవైద్యులకు చూపండి, అందరు general dentists చిన్న పిల్లలకు x-rays తీయలేకపోవచ్చు.

    అవసరం అయితే, ఓ సారి చూయించినతర్వాత, ఎ మయినా ప్రశ్నలు ఉంటే తప్పకుండా అడగండి.

    ReplyDelete
  6. బిందు గారు, మీ సమాధానానికి ధన్యవాదాలు. నా ప్రశ్న కొంచెం తప్పుగా అడిగానండి. ముందరి పళ్ళు పైన, కింద పూర్తిగా వచ్చాయి. లోపలి దంతాలు - పైన ఇరుపక్కలా ఒక్కొక్కటి, కింద ఇరుపక్కలా ఒక్కొక్కటి వచ్చాయి. దంత వైద్యుని వద్దకి తీసుకొని వెడదాము అనుకుంటున్నాము - ఐతే, వీడు ex -రే కి ఎంత సహకరిస్తాడో చూడాలి :).

    ReplyDelete
  7. హమ్మయ్య, నేను మీరు ఒక్క పన్నే వచ్చింది అనేసరికి కంగారు పడ్డాను, పుస్తకాలలో చదవటమే కాని, నా (దాదాపు 10 ఏళ్ళ) అనుభవంలో , ఎవరనీ చూడలేదు, అందుకని Dentist ను కలవమన్నాను. మీరు చెప్పేదానిని బట్టి, రావాల్సిన పాలపళ్ళు (మొత్తం 20 పై వరస, కింద వరస కలిపి) లలో దదాపు అన్ని వచ్చినవి కాని, కొన్ని రాలేదు అని, దానికి కంగారు పడాల్సింది ఎమీలేదు, కొందరిపిల్లలో రావటానికి కొంచం ఆలస్యం అవుతుంది, మా వాడికి అన్నీ పూర్తిగా మూడున్నర ఏళ్లకు గాని రాలేదు.

    పళ్లు రావటం లేదనే కారణం గా మాత్రం మీరు Dentist ను కలవాల్సిన అవసరం లేదు కాని, ఒ సారి మాత్రం Dentist దగ్గరకు తీసుకెళ్లండి, Oral Hygiene ఎలా ఉంది check చేస్తారు, అదీగాక పిల్లలను చిన్నప్పటినుండి తీసుకెళ్లటం మొదలు పెడితే Dentist లు అంటే భయం పోతుంది, అంతేకాక, ఏమయైనా అవసరం అయిన treatements ఉంటే అవి పెద్దవి కాకుండానే చేయటానికి కుదురుతుంది. ఇక xray కు ఇష్టపడకపోయినా, వంగకపోయినా కంగారుపడకండి, కొద్దిమంది మొదటసారి వెళ్లినప్పుడు ఇష్టపడకపోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం పిల్లవానిని మాత్రం traumatize చేయకండి. పిల్లలను ఇష్టం గా చూసే ఏ Dentist దగ్గరకు అయినా తీసుకెళ్లండి, you will have good experience.

    ReplyDelete