Tuesday, June 15, 2010

మన వారిలో ఎక్కువగా కనిపించే దంత సమస్య - చిగుళ్ళవ్యాధులు ( Gum Diseases)

ముందుగా ఈ టపా కు స్పూర్తినిచ్చిన టపాలు , వాటిని వ్రాసిన  నేస్తం   గారికి కృతఙ్ఞతలు చెప్పుతూ, ఆ టపాలు చదవకపోతే తప్పకుండా ఒక సారి చదవండి, ఎంతో సరదాగా, సాధారణం గా మన తెలుగు వాళ్ళు ముఖ్యం గా పరాయి దేశాలలో ఉండే వాళ్ళు పళ్ళ బాధలు , పళ్ళ వైద్యుల గురించి ఎలా భావిస్తారో, ఓ ప్రక్క నవ్విస్తూనే మరో పక్క తన బాధలు చక్కగా వ్యక్త పరిచారు.

ఎప్పటినుండో మన వాళ్ళు అశ్రద్దచేసే చిగుళ్ళసమస్యలు వాటికి తీసుకోవాల్సిన  జాగ్రత్తలు గురించి వ్రాయాలి అని అనుకొంటూ  ఉండగానే, ఆ టపా ఇంకోసారి దాని గుర్తుచేసింది.



పై చిత్రం లో ఎడమప్రక్క  ఆరోగ్యమంతమయిన పన్ను, కుడి ప్రక్క  చిగుళ్ళ వ్యాధి ఉన్న పన్ను భాగాలు చూపిస్తుంది.

                              మనం ఎంత సరిగా బ్రష్ చేసుకొన్నా, పళ్ళ మధ్యన ఎంతోకొంత తిండి పదార్దాలు ఇరుక్కొని ఉండటం  వలన ,  దంతక్షయం  మొదలు అవుతుంది. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోకపోవటం, అలాగే ఫ్లాస్ చేసుకోకపోవటము, క్రమంతప్పకుండా దంత వైద్యుల దగ్గరకు వెళ్లి, మనం చేసుకొనే బ్రష్ ద్వారా పోని plaque  ను తీయుంచుకోనివారిలో దంత క్షయం సాధారణం గా మొదలు అవుతుంది. అలా పేరుకొన్న plaque గట్టిపడి tartar/calculus   తయారు అవుతుంది, ఇది చిగుళ్ళ పైనే కాక, చిగుళ్ళ క్రింద కూడా మొదలవుతుంది. ఇలా మొదలయిన plaque/calculus బాక్టీరియా దంతక్షయాన్ని కలిగించటమే కాక, చిగుళ్ళ వ్యాది మొదటి దశ అయిన gingavitis కు కారణం అవుతుంది.

                                  Gingavitis (చిగుళ్ళ వ్యాధి లో  మొదటి దశ) లక్షణాలు:
ఈ దశ లో చిగురు వాపు, చిగుళ్ళ వెంబడి బ్రష్ చేస్తున్నప్పుడు రక్తం కొద్దిగా రావటం, అలాగే చిగురుకు,పంటికి మధ్య ఆరోగ్యవంతమయిన పంటి లో ఉండే గ్యాప్ 2,3 మిల్లీమీటర్ లకు బదులు ఎక్కువుగా ఉండటం, అంతే కాక xray లలో పంటి చిగురుకింద calculus కనిపించటం కనిపిస్తాయి. ఈ దశలో ఎటువంటీ నొప్పులు రావటం జరగదు, అందుకని చాలా మంది ఈ దశలో దంతవైద్యుల వద్దకు వెళ్లకపోవటం జరుగుతుంది.

                                   Periodontitis (చిగుళ్ళ వ్యాధి లో తర్వాత దశ) :
 పైన Gingavitis  ను పట్టించుకోకుండా ఉన్నవారిలో ఇది ఉంటుంది.   ఈ దశలో plaque /calculus చిగుళ్ళ కింద ఎక్కువ అవుతూ, పంటి చుట్టూ  ఉండే bone loss మొదలు అవుతుంది, అది క్రమంగా పెరిగి చివరకు severe infections రావటం, పంటి చుట్టూ ఉండే ఎముక తగ్గిపోవటం వలన పన్ను కదిలిపోవటం, నెప్పులు రావటం జరుగుతుంది. చివరకు పళ్ళు పీకిన్చుకొనే పరిస్థితి వస్తుంది.

                                   Treatments :చాలా మొదటి దశ లో  ఉన్నప్పుడు  రెగ్యులర్ cleaning, floss, mouthwash వాడటం సరిపోవచ్చు. కొద్ది ఎక్కువుగా ఉన్నప్పుడు, వైద్యులు SCRP (scaling and root plannig) aka Deep Cleaning  సూచించవచ్చు, కొన్ని పుక్కిలించే మందులు వాడమని చెప్పవచ్చు, ఓ సారి Deep Cleaning  చేసినతర్వాత సాధారణం గా, ౩ నెలలో ఇంకొకసారి రమ్మంటారు, అప్పుడు మళ్ళీ గ్యాప్ కొలతలు తీసుకోవటం, అలాగే చిగుళ్ళ ఆరోగ్యం చూడటం చేస్తారు, అంతా బాగుంటే తర్వాత రెగ్యులర్ గా ప్రతి ఆరు నెలలకు వచ్చి క్లీనింగ్ చేయించుకొనే visits కు schedule చేయటం జరుగుతుంది.

పాతరోజులలో కేవలం hand scalers  వాడి  deep cleanings  చేసేటప్పుడు నెప్పి బాగానే వచ్చేది కాని, ultrasonic scalers  వాడి అదీ మంచి స్కిల్ ఉన్న వారు చేస్తే ఎ మాత్రం నెప్పి రావటం జరగదు, వచ్చినా చాలా తక్కువ మోతాదులో వచ్చి ఒకటి రెండు రోజులలో పోతుంది. (నెప్పి రాలేదు కాబట్టి క్లీనింగ్ సరిగా చేయలేదు అని మాత్రం అనుకోకండి :)) )  కొన్ని ఆఫీసులలో క్లీనింగ్ చేసిన తర్వాత (ముఖ్యం గా heavy calculus ఉన్న కేసులలో) x-rays  తీసి మొత్తం తీయగాలిగారో లేదో కంపేర్ చేసుకొని చూస్తారు.
ఒకసారి gingavitis  కు ట్రీట్మెంట్ చేసినతర్వాత, చిగుళ్ళ నుండి  రక్తం రావటం  అదీ తగ్గటానికి ఒకటి, రెండు వారాల వరకు, కొందరిలో ఇంకొంత సమయం పడుతుంది. Gum Inflamation , ఒక్కరోజులోనే క్లీనింగ్ చేసినతర్వాత తగ్గాలని ఆశించవద్దు. అలాగే పూర్తిగా తగ్గటానికి  మీ వైద్యులు చెప్పినట్లు, floss చేసుకోవటం, mouth rinses  లాంటివి ఏమయినా రికమెండ్ చేస్తే అవి వాడటం ముఖ్యం.
చిగుళ్ళ వ్యాధి పెరిగినకొద్దీ, surgical treatments అవసరపడవచ్చు. కొన్నిసార్లు పంటిని (కాపాడలేక) పీకి, దాని ప్లేస్ లో implant లు పెట్టటం లాంటివి తప్పకపోవచ్చు.

అన్నిటికంటే ముఖ్యమయినది, చిగుళ్ళ వ్యాధికి, గుండె జబ్బులకు, చక్కర వ్యాధికి లింకులు. చక్కర వ్యాధి గ్రస్తులలో చిగుళ్ళ వ్యాధి రావటం ఎక్కువ అయితే, చిగుళ్ళ వ్యాధి ని treat చేయని వారిలో, చక్కెరవ్యాధి ని తగ్గించటం కష్టం అని చూపే studies. అలాగే ఈ మధ్యన చిగుళ్ళ వ్యాధికి, గుండె జబ్బులకు,  stroke  రావటానికి strong links  ఉన్నవి అని కొన్ని స్టడీస్ చెపుతున్నాయి. గుండె జబ్బులు ఉన్న వారిలో చిగుళ్ళ వ్యాధి ఎక్కువుగా మేము చూస్తూ ఉంటె, కొన్ని స్టడీస్ చిగుళ్ళ వ్యాధి వలన కలిగే bacterial infection రక్తం లో కలసి C-reactive protein (CRP) లెవెల్స్ పెరగటానికి  తద్వారా రక్తనాళాలు clog  అవి గుండెపోటులు, strokes  రావటానికి కారణం అవుతున్నాయని సూచిస్తున్నాయి. అందుకని ఈ మధ్యన దంతవైదులు, గుండెజబ్బు నిపుణులు కలసి ట్రీట్మెంట్ planning  చేయటం కుడా జరుగుతుంది. ఉదా: బైపాస్ సర్జరీ లాంటి గుండె ఆపరేషన్లు చేసే ముందు, టైం ఉంటె, cardiologist  లు perio disease ట్రీట్ చేయించుకోమని దంతవైద్యులవద్దకు పంపటం, అలాగే periodontitis ఉన్న పేషంట్లను వాళ్ళు health చెక్ చేయించుకొని ఉండకపోతే, డాక్టర్ వద్దకు వెళ్లి, physical checkup చేయించుకోమని దంతవైద్యులు రికమెండ్ చేయటం ఇప్పుడు సర్వసాధారణం అయ్యింది.

మీ పంటి ఆరోగ్యం కోసమే కాక,  మీ ఓవరాల్ శారీరక  ఆరోగ్య అవసరార్ధం  చిగుళ్ళ వ్యాధులను దయచేసి అశ్రద్ద చేయకండి, నా ఉద్దేశ్యంలో మన వాళ్ళు ఎక్కువుగా అశ్రద్ద చేసే దంత జబ్బులలో ఇది మొట్టమొదటది, ముఖ్యంగా ప్రవాసభారతీయులలో ప్రతి నలుగురులో ఇద్దరు, ముగ్గురులో నయినా, చిగుళ్ళ వ్యాధి కనిపిస్తూ ఉంటుంది. Oral hygiene, Diabetes, untreated bloodpressure, smoking  లాంటివే కాక stress కుడా చిగుళ్ళ వ్యాధికి కారణాలలో ఒకటి.
గమనిక: చిగుళ్ళ వైద్యం అనేది చాలా పెద్ద subject,  అది దంతవైద్యం లో ఓ speciality. ఇక్కడ వీలయినంత వరకూ క్లుప్తంగా వివరించటానికి ప్రయత్నించాను. ఇంకా వివరాలు కావాలంటే periodontal disease అని అంతర్జాలంలో వెతికి చూడండి.
 ఇక్కడ వ్ర్రాసినది, కేవలం సలహా కోసం మాత్రమే, ఇది మీ డెంటల్/మెడికల్ డాక్టర్ లు మిమ్ములను చూసి ఇచ్చే ట్రీట్మెంట్లకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు. మీకు దంత సమస్యలు ఉంటే మీ డెంటిస్ట్ / మెడికల్ డాక్టర్ ను సంప్రదించండి.

9 comments:

  1. Many thanks for posting this valuable information.

    ReplyDelete
  2. Thank you very much for your suggestions.

    keep posting!!!

    ReplyDelete
  3. Great Post bro. Keep us stay tuned with ur blog

    ReplyDelete
  4. బిందు ఇప్పుడే చూసా మీ పోస్ట్లు.. ఏదో సరదాగా రాసాను కాని నిజానికి పంటి నెప్పి అబ్బో సామాన్యమైనది కాదు..చాలా మంచి పోస్ట్ వేసారు.. మరిన్ని మంచి పోస్ట్లు మీనుండి రావాలని ఆశిస్తున్నాను ..

    ReplyDelete
  5. బిందు గారు ఒక చిన్న సందేహం ..నా క్రింద పలువరస ముందు పళ్ళ మద్య చిన్నగా గ్యాప్ మొదలైంది ఈ మధ్య.. క్లిప్ వేయడం ఒక్కటేనా పరిష్కారం?? మరేమైనా ఉందా తెలుపగలరు ...ముందుగానే ధన్యవాదాలు చెప్పెస్తున్నా :)

    ReplyDelete
  6. Useful info.. Thanks so much!

    ReplyDelete
  7. ముందుగా కామెంట్ పెట్టిన అందరకూ దన్యవాదాలు. ఎవరయినా చదువుతున్నారా? బిజీ గా ఉండే schedule లో వీలుచూసుకొని నాకు తెలిసినంతలో దంతవైద్యం గురించి టపాలు వ్రాయటం వలన ఎమయినా ఉపయోగం ఉంటుందా అన్న సందెహాలకు మీ కామెంట్లే సమధానాలు చెప్తున్నాయి. కొందరయినా చదువుతున్నారని తెలిసెది వాటివలనే.

    @ నేస్తం,
    పళ్ల మధ్యన గ్యాప్ తీసివేయటానికి ఒక్క క్లిప్పులు మాత్రమె కాకుండా, invisible aligners (braces) కూడా ఉన్నాయి. కాని అవి ఎమీ మీ గ్యాపుకు సమాధానం కాకపోవచ్చు.

    మీ కామెంట్ లొ "ఈ మధ్య.." అన్న మాట గురించే నా concern. ఈ మధ్యనే గ్యాప్ రావటం మొదలయ్యింది అంటే, ముందు దానికి root cause ఎమిటో చూడగలిగితే దానిని బట్టి treatment ఉంటుంది.
    ఇంతకముందు లెకుండా ఇప్పుదు గ్యాప్ మొదలవటానికి పైన చెప్పిన perio కారణం కావచ్చు, లేక ఎదయినా పన్ను పీకించుకొని ఆ గ్యాప్ ను అలా వదిలివేయటం వలన, మిగతా పళ్లు కదలిపోవటం మొదలవటం వలన కావచ్చు.
    ఏదయినా ముందు ఒకసారి Dentist, consultation తీసుకోండి ఎందువలన గ్యాప్ వస్తూ ఉందో, ఆ తర్వాత దానిని ఎలా సరిచేయాలో అలోచించవచ్చు.

    ReplyDelete
  8. మీ పోస్ట్ ఇప్పుడే చూసానండి , బాగుంది . చాలా వాల్యబుల్ ఇంఫర్మేషన్ ఇచ్చారు .
    ఈ మద్య ఏదైనా ఖారం తిన్న తరువాత పళ్ళు నొప్పులు గా అనిపిస్తున్నాయి . ఏంచేయమంటారు ?

    ReplyDelete
  9. మీరు చెప్ప్తున్న దానిని బట్టి కారం (spicy) తింటే నెప్పులు (irritation) వస్తున్నాయి అంటే అవి "సాధారణం" గా చిగుళ్ల వాపు వలనే కావచ్చునండి. Gum inflamation ఉన్నప్పుడు, perio disease వలనే అవటానికి chances ఎక్కువ.
    కాని కచ్చితంగా చెప్పలంటే, చూసి, xraysలు తీస్తే కాని చెప్పలేము.
    ఈ మధ్య కాలంలో మీరు Dentist దగ్గరకు వెళ్లి ఉండకపోతే , ఒకసారి వెళ్లి చూయించుకోండి, వెళ్లినప్పుడు ఓ సారి x-rays తీసి చిగుళ్ల కింద build up ఉందేమో చూడమని అడగండి. అలాగే వాళ్లు recommend చెస్తే అవసరమయిన cleanings చేయించుకోండి, వాళ్లు peridex లాంటి oral rinses ఎమయినా recommend చెస్తే తప్పకుండా వాడండి, ముఖ్యంగా వెళ్లినప్పుడు మీకు perio disease ఉందా, ఉంటే ఏ స్టెజి లో ఉంది లాంటి ప్రశ్న లు అడగటం మరచిపోకండి.

    ReplyDelete