Tuesday, June 15, 2010
మన వారిలో ఎక్కువగా కనిపించే దంత సమస్య - చిగుళ్ళవ్యాధులు ( Gum Diseases)
ముందుగా ఈ టపా కు స్పూర్తినిచ్చిన టపాలు , వాటిని వ్రాసిన నేస్తం గారికి కృతఙ్ఞతలు చెప్పుతూ, ఆ టపాలు చదవకపోతే తప్పకుండా ఒక సారి చదవండి, ఎంతో సరదాగా, సాధారణం గా మన తెలుగు వాళ్ళు ముఖ్యం గా పరాయి దేశాలలో ఉండే వాళ్ళు పళ్ళ బాధలు , పళ్ళ వైద్యుల గురించి ఎలా భావిస్తారో, ఓ ప్రక్క నవ్విస్తూనే మరో పక్క తన బాధలు చక్కగా వ్యక్త పరిచారు.
Labels:
telugu-dentist-dallas,
చిగుళ్ళ వ్యాధులు
Location:
Dallas, TX, USA
Saturday, November 21, 2009
గర్భిణీ స్త్రీలు, పళ్ళ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
గర్భంతో ఉన్నప్పుడు Dentist దగ్గరకు వెళ్లాలా సాధారణంగా ఆరు నెలలకో సారి వెళ్లినట్లు పళ్లు చూయించుకోవటానికి, వెళ్లితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ గర్భంతో ఉన్నప్పుడు పళ్ల నెప్పులు వస్తే ఏమి చేయాలి అని పిల్లలకోసం plan చేసే వారు, గర్భంతో ఉన్న వారు అడుగుతూ ఉంటారు. వాటి గురించి ఈ టపా.
1. గర్భం తో ఉన్నప్పుడు డెంటిస్ట్ దగ్గరకు వెళ్లాలా?
గర్భంతో ఉన్నప్పుడు చిగుళ్లు సాధారణం గా ఎక్కువగా రక్తం కారుతూ ఉంటాయి హార్మోన్ల వలన. అందుకని ప్రతి ఆరునెలల క్లీనింగ్ కు వెళ్లె visits చాలా ముఖ్యం గర్భిణితో ఉన్నప్పుడు. అంతేకాక రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవటం, floss చేసుకోవటం మాములు అప్పుడు కంటే ఎక్కువ ముఖ్యం. మీ చిగుళ్ళు, మీ దంతాల పరిస్థితి ని బట్టి, మీ డెంటిస్ట్ మామూలు కంటే ఎక్కువసార్లు క్లీనింగ్స్ కూడా సూచించవచ్చు.
గర్భంతో ఉన్నప్పుడు ఏమయినా పళ్ళ నెప్పులు infections లాంటివి వస్తే వాటిని సరిగా ట్రీట్ చేయించుకోకపోతే మీతో పాటు మీ గర్భం లో ఉన్న శిశువు కు కూడా రిస్క్ కావచ్చు, కాబట్టి "అవసరమయిన" ట్రీట్మెంట్స్ చేయించుకోవటం తప్పనిసరి.
2. డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ముందుగా మీరు గర్భం తో ఉన్నట్లు డెంటిస్ట్ కు కాని, వాళ్ల స్టాఫ్ కు కాని చెప్పటం మర్చిపోకండి. దానిని బట్టి వాళ్లు ఎక్సరేలు తీసేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తారు (ఉదా : వీలయినన్ని ఎక్సరే లు గర్భం తర్వాత తీయటం, తక్కువుగా ఎక్సరేలు తీయటం, తీసేటప్పుడు రెండు ఎక్సరే బేరియర్స్ వాడటం లాంటివి). అంతే కాకుండా ఎనస్థీషియా ఇవ్వాల్సి వచ్చినా, ఎమయినా మందులు ఇచ్చినా జాగ్రత్తలు పాటిస్తారు. ఒక్కోసారి మీ గైనకాలజిస్ట్ ను కూడా సంప్రదిస్తారు ఎమయినా ట్రీట్మెంట్ ఇవ్వాల్సివస్తే.
౩. పిల్లలకు పాలు ఇస్తున్నవారు డెంటిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ కు వెళ్ళవచ్చా?
సుబ్బరం గా వెళ్ళవచ్చు. డెంటిస్ట్ ల వాడే ఎక్సరే లు కాని, పళ్లకు (అవసరం అయితే) ఇచ్చే ఏనాస్తీసియా మందులు novacaine/lidocaine కాని breast ఫీడింగ్ కు ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఇవ్వవు. ఏమయినా అనుమానం ఉంటె మీ గైనకాలజిస్ట్ ను కనుక్కోండి కాని, అమ్ముమ్మ చెప్పింది అనో, మా పక్కింటి ఆంటీ చెప్పింది అనో మాత్రం, డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళటం మానకండి.
గమనిక: ఇక్కడ వ్ర్రాసినది, కేవలం సూచనలు గానే తీసుకోండి, ఇది సలహా గా కాని, మీ డెంటల్/మెడికల్ డాక్టర్ లు మిమ్ములను చూసి ఇచ్చే ట్రీట్మెంట్లకు ప్రత్యామ్నాయం గా కాని తీసుకోకండి. మీకు దంత సమస్యలు ఉంటే మీ డెంటిస్ట్ / మెడికల్ డాక్టర్ ను సంప్రదించండి. (మా మీద సూలు గట్రాలు పడకుండా జాగ్రత్తపడే ముక్కలు అన్నమాట పైనవి :) )

Saturday, September 19, 2009
పిల్లల పళ్ల గురుంచి సాధారణం గా తల్లితండ్రులు అడిగే ప్రశ్నలు & నా సలహాలు.
నేను జనరల్ డెంటిస్ట్ ని అయినప్పటికి, చిన్న పిల్లలను కూడా ట్రీట్ చేస్తూ ఉంటాను, సాధారణంగా చిన్న పిల్లలు ఉన్న తల్లితండ్రులు నన్ను అడిగే ప్రశ్నలు వాటికి నా సలహాలు మన తెలుగు వాళ్ల కోసం.
1. ఏ వయసులో పిల్లలను డెంటిస్ట్ దగ్గరకు తీసుకుకొని వెళ్లటం మొదలు పెట్టాలి?
మొదటి పుట్టినరోజు వచ్చేటప్పటికి, అప్పటికి పళ్లు రావటం మొదలుపెడతాయి కాబట్టి. పిల్లలలో బాటిల్ త్రాగుతూ (జ్యూస్ కాని, పాలు కాని) నిద్ర పుచ్చటం, బ్రష్ సరిగా చేయకపోవటం, ముఖ్యం గా, చాక్లేట్ లు లాంటి వి తిన్న తరువాత, చాలా చిన్నపిల్లలలో కూడా (18 నెలలనుండి, 3 సంవత్సరాల పిల్లలలో కూడా) దంతక్షయం చూస్తూ ఉంటాము అందుకని.
2. పిల్లల దంత ఆరొగ్యానికి మీరిచ్చే సలహాలు
ముందు బాటిల్స్ అందులొ ముఖ్యంగా జ్యూస్ ఇచ్చి నిద్రపుచ్చే అలవాటు ఉన్నట్లయితే మానివేయండి. బాటిల్స్ 12 నెలల వయసు నుండి 18 నెలల వయసులో మానివెయటం మంచిది.
రోజుకు రెండు సార్లు పెద్ద వాళ్ల కు వలనే, పిల్లలకు కూడా పిల్లల బ్రష్ తో బ్రష్ చేయండి. ఆ వయసులో పేస్ట్ బయటకు ఊయలేరు కాబట్టి, చాలా తక్కువ పేస్ట్ వేసి బ్రష్ చేయటం మంచిది.
గమనిక: ఇక్కడ వ్ర్రాసినది, కేవలం సలహా కోసం మాత్రమే, ఇది మీ డెంటల్/మెడికల్ డాక్టర్ లు మిమ్ములను చూసి ఇచ్చే ట్రీట్మెంట్లకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు. మీకు దంత సమస్యలు ఉంటే మీ డెంటిస్ట్ / మెడికల్ డాక్టర్ ను సంప్రదించండి. (మా మీద సూలు గట్రాలు పడకుండా జాగ్రత్తపడే ముక్కలు అన్నమాట పైనవి :) )

Subscribe to:
Posts (Atom)